News March 7, 2025

ప్రేగ్ టోర్నమెంట్ విజేత అరవింద్ చిదంబరం

image

ప్రేగ్‌ మాస్టర్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం విజేతగా నిలిచారు. తన ప్రత్యర్థి టర్కీ ఆటగాడు ఎడిజ్ గురేల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసి మెుత్తంగా 6/9 పాయింట్లతో విజేతగా నిలిచారు. దీంతో లైవ్‌రేటింగ్ 2743తో ప్రపంచవ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించారు. మ్యాచ్ ఒత్తిడి వల్ల 2 రోజులుగా సరిగ్గా నిద్రపోలేదని, విజయం సాధించటంలో తన మెంటార్ ప్రధాన పాత్ర పోషించాడని గ్రాండ్ మాస్టర్ తెలిపారు.

Similar News

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.

News March 9, 2026

‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

image

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <>mygov.in<<>>లో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. మార్చి 20 ఈ పోటీకి చివరి తేదీ. కాగా వీబీ జీ రామ్ జీ స్కీమ్‌లో భాగంగా పని దినాలను 100 నుంచి 125కి పెంచింది.