News October 10, 2024

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..

image

భారత్‌ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Similar News

News December 10, 2025

NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

<>NTPC<<>> 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్( ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News December 10, 2025

కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

image

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.

News December 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు