News October 10, 2024
సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..

భారత్‌ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
Similar News
News December 16, 2025
CTETకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్

CTETకు అప్లై చేయడానికి ఎల్లుండి వరకే అవకాశం ఉంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.EI.Ed అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. వెబ్‌సైట్: ctet.nic.in/
News December 16, 2025
హనుమాన్ చాలీసా భావం – 40

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా ||
భావం: ‘తులసీదాసు వలె నేను కూడా నీ పరమ భక్తుడని హనుమా! కాబట్టి నా హృదయాన్ని కూడా నీ నివాసంగా చేసుకో. నాపై కరుణ చూపి నన్ను అనుగ్రహించు. నీ అపారమైన శక్తితో నన్ను కాపాడు. భయాలను, దోషాలను తొలగించు స్వామీ!’
హనుమాన్ చాలీసా ఇంతటితో పూర్తైంది. మొదటి శ్లోకం నుంచి భావాన్ని తెలుసుకోవడానికి <<-se>>#HANUMANCHALISA<<>> హ్యాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేయండి.
News December 16, 2025
గ్రీన్‌కు రూ.25.20 కోట్లు

IPL మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు KKR దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం కేకేఆర్, చెన్నై పోటీ పడ్డాయి. దీంతో IPL వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్ రూ.18 కోట్లు అందుకోనున్నారు. మిగిలిన మొత్తం వెల్ఫేర్ ఫండ్‌కు వెళ్లనుంది. అటు డేవిడ్ మిల్లర్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.


