News June 26, 2024
విపక్ష నేతగా రాహుల్ గాంధీ.. అందే సౌకర్యాలివే

ఈ ఎన్నికల్లో INC 99 సీట్లను గెలుచుకోవడంతో రాహుల్ గాంధీకి విపక్ష నేత హోదా దక్కింది. దీంతో ఆయనకు కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు అందుతాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, Z+ కేటగిరీ భద్రత, పార్లమెంట్‌లో ఆయనకో కార్యాలయం, బంగ్లా, సిబ్బంది ఉంటారు. లోక్‌సభ ముందు వరుసలో తొలి సీటు కేటాయిస్తారు. EC ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, CBI, ED, విజిలెన్స్ కమిషన్ చీఫ్‌లను నియమించే కమిటీలో రాహుల్ కీలకంగా వ్యవహరిస్తారు.
Similar News
News February 16, 2025
నేటి నుంచి కులగణన రీసర్వే

TG: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన కులసర్వేలో పాల్గొనని వారికి నేటి నుంచి రీసర్వే చేయనున్నారు. ఈ సారి 3.56 లక్షల కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేయడం, ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో వివరాలు అందించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. ఈ నెల 28 వరకు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు.
News February 16, 2025
మరో వలసదారుల బ్యాచ్‌ను పంపించిన US

116మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్‌కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చినవారిలో పంజాబ్(65మంది), హరియాణా(33), గుజరాత్(8మంది), యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తలో ఇద్దరు, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే.
News February 16, 2025
IPL 2025: హైదరాబాద్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్?

హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్‌లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా SRH తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు సమాచారం. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.