News April 13, 2025
ASF : BRS సిద్ధమా.. పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆసిఫాబాద్, సిర్పూర్ శ్రేణులకు ఇప్పటికే MLA కోవ లక్ష్మి, సిర్పూర్‌లో రాష్ట్ర నేత RS ప్రవీణ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 15, 2025
పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు.. ఎంతకు తెగించార్రా?

గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. చివరికి పోస్టల్ సర్వీస్‌నూ వదల్లేదు. యూనియన్ టెరిటరీ దాద్రానగర్ హవేలీలోని దీవ్ నుంచి పోస్ట్ మాస్టర్ సాయంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పోస్టల్ స్టాంప్ ఉన్న పార్శిల్స్ చెక్ చేయరని ఈ దారి ఎంచుకున్నారు. కానీ బార్డర్లో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.
News April 15, 2025
ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?

అవసరానికి మించి ఉప్పు తీసుకోవడం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. WHO చెప్పినట్లు రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు (దాదాపు 2గ్రాముల సోడియం) తీసుకోవాలని తెలిపారు. ఈ మోతాదు మించితే రక్తపోటు, శరీరంలో నీరు చేరడం, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాస్‌లు, నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటున్నారు.
News April 15, 2025
ముస్లింలపై మోదీ వ్యాఖ్యలు.. ఒవైసీ కౌంటర్

హరియాణాలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ Xలో విమర్శలు గుప్పించారు. ‘వక్ఫ్ పేరిట దేశంలో లక్షల ఎకరాల భూములున్నాయి. వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే ముస్లిం పిల్లలు సైకిల్ పంక్చర్ పనులు చేసుకోవాల్సి వచ్చేది కాదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ‘సంఘ్ పరివార్ ఆస్తులు దేశం కోసం వినియోగించి ఉంటే మోదీ టీ అమ్మాల్సి వచ్చేది కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.