News December 25, 2024

కపిల్ దేవ్‌ను తప్పుబట్టిన అశ్విన్

image

తన చేతిలో విషయమైతే అశ్విన్‌ను అలా సాదాసీదాగా రిటైర్ కానిచ్చేవాడిని కానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల్ని అశ్విన్ తప్పుబట్టారు. ఫేర్‌వెల్ మ్యాచులనేవి తనకు నచ్చవని స్పష్టం చేశారు. అవి సెలబ్రిటీ సంస్కృతిలో భాగమన్నారు. ‘నాకోసం ఎవరైనా ఒక చుక్క కన్నీరు కార్చినా నాకిష్టం ఉండదు. ఒకరి ఘనతల్ని చూసి స్ఫూర్తి పొందొచ్చు. అంతే తప్ప ఆ ఘనతల వెనక పడకూడదు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్

image

సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో మూవీ టీమ్ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని పేర్కొంది.

News January 14, 2025

లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు

image

లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.

News January 14, 2025

పాకిస్థాన్‌కు రోహిత్ శర్మ?

image

<<14970733>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> ప్రారంభానికి ముందు IND కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ICC టోర్నీల ప్రారంభానికి ముందు హోస్ట్ నేషన్‌లో అన్ని జట్ల కెప్టెన్లు ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈసారి CTని పాక్ హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి రోహిత్ వెళ్తారా? లేదా ఫొటో షూట్‌ను వేరే చోట నిర్వహిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.