News September 6, 2024
‘టైమ్స్ AI ప్రభావశీలురు’ జాబితాలో అశ్విని వైష్ణవ్, అనిల్ కపూర్
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ రంగంలో ప్రభావం చూపగల 100మంది ప్రముఖుల జాబితాలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, నటుడు అనిల్ కపూర్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. ఏఐలో తన వివరాలను దుర్వినియోగం చేయడంపై కపూర్ న్యాయపోరాటం చేసి గెలిచారు. ఈ కారణంగా ఆయనకు లిస్ట్‌లో చోటు దక్కినట్లు టైమ్స్ తెలిపింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అమెజాన్ ఏజీఐ హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ తదితరులు జాబితాలో ఉన్నారు.
Similar News
News October 7, 2024
అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు
1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1900: తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి గంటి జోగి సోమయాజి జననం
1940: పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం
1979: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం
News October 7, 2024
నోర్మూసుకుని కూర్చో: కమెడియన్‌తో ఓలా సీఈఓ
ఓలా బైక్స్‌ను విమర్శిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్‌పై ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్ మండిపడ్డారు. అంత బాధగా ఉంటే వచ్చి హెల్ప్ చేయాలని సూచించారు. ‘వచ్చి మాకు సాయం చేయండి. మీ పెయిడ్ ట్వీట్ లేదా మీ విఫల కెరీర్ వల్ల మీకొచ్చేదాని కంటే ఎక్కువ జీతం ఇస్తా. లేదంటే నోర్మూసుకుని కూర్చోండి. నిజమైన వినియోగదారుల కోసం సమస్యల్ని సరిచేయనివ్వండి. మా సేవల్ని మరింత విస్తరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News October 7, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.