News August 17, 2024
రైలు ప్రమాద ఘటనపై స్పందించిన అశ్వినీ వైష్ణవ్

సబర్మతీ ఎక్స్‌ప్రెస్ <<13874280>>రైలు ప్రమాదంపై <<>>రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీ కొట్టడంతో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. సాక్ష్యాలు భద్రపరిచాం. IB, UP పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల కోసం రైలు ఏర్పాటు చేశాం’ అని ట్వీట్ చేశారు. పట్టాలపై రాళ్లు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 20, 2025
ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.
News November 20, 2025
KTRకు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో KTRపై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.
News November 20, 2025
చలికి తట్టుకోలేకపోతున్నా దుప్పటి ఇప్పించండి: నటుడు

రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ చలికి తట్టుకోలేక జడ్జి ముందు వాపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఆయన.. “చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనీసం అదనపు దుప్పటి ఇప్పించండి” అని కోరారు. మరో నిందితుడు నాగరాజు కూడా అదే విధంగా అభ్యర్థించాడు. జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. వెంటనే కంబళి ఇవ్వాలని ఆదేశించారు. విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేశారు.


