News August 17, 2024
రైలు ప్రమాద ఘటనపై స్పందించిన అశ్వినీ వైష్ణవ్
సబర్మతీ ఎక్స్‌ప్రెస్ <<13874280>>రైలు ప్రమాదంపై <<>>రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీ కొట్టడంతో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. సాక్ష్యాలు భద్రపరిచాం. IB, UP పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల కోసం రైలు ఏర్పాటు చేశాం’ అని ట్వీట్ చేశారు. పట్టాలపై రాళ్లు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News September 13, 2024
కొందరు పోలీసుల తీరు మారడం లేదు: జనసేన
AP: ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారడం లేదని జనసేన ట్వీట్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమంలో వస్తున్నాయంది. గత ప్రభుత్వంలో YCP నేతల దౌర్జన్యాలకు సహకరించిన పోలీసుల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారంది. ఇప్పటికీ కొందరు పోలీసులు అదే తీరును కొనసాగిస్తున్నట్లు వారు వాపోయారని తెలిపింది.
News September 13, 2024
కోహ్లీతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
News September 13, 2024
BREAKING: మరో అల్పపీడనం
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.