News August 14, 2024
క్రీడా మంత్రిత్వ శాఖపై అశ్విని విమర్శలు
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న షట్లర్ అశ్విని పొన్నప్ప కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేశారు. ‘నాకు రూ.4.50 లక్షలు చెల్లించి.. శిక్షణ, టోర్నీల కోసం రూ.1.48కోట్లు ఖర్చు చేసినట్లు సాయ్ ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. ఇందులో వాస్తవం లేదు. నాకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పడం సరికాదు. కనీసం ప్రత్యేక కోచ్‌ని కూడా నియమించలేదు. ట్రైనర్‌కు కూడా నేనే డబ్బులు ఇస్తున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 10, 2024
సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక
అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.
News September 10, 2024
విరాట్ బెస్ట్ బ్యాటర్.. స్టెయిన్ బెస్ట్ బౌలర్: KL రాహుల్
తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బౌలర్లలో డేల్ స్టెయిన్‌ను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. విరాట్, రోహిత్, సూర్య, బాబర్ ఆజం, ట్రావిస్ హెడ్ ప్రస్తుతం ఉత్తమ బ్యాటర్లని ఆయన అన్నారు. బౌలర్లలో స్టెయిన్, ఆండర్సన్, బుమ్రా, రషీద్, నసీమ్ షాలను అత్యుత్తమంగా భావిస్తానని పేర్కొన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు ‘మేఘా’ సంస్థ భారీ విరాళం
AP: వరద బాధితులకు మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకు ఇచ్చారు. జీఎంఆర్ సంస్థ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది.