News August 29, 2024

అశ్విన్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్.. గేల్, రస్సెల్‌కు నో ఛాన్స్

image

టీమ్ ఇండియా వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్ ప్రకటించారు. ఇందులో విధ్వంసకర ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆండ్రె రస్సెల్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ వంటి ఆటగాళ్లకు చోటు కల్పించలేదు. టీమ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, డివిలియర్స్, ధోనీ (C), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, మలింగ. దీనిపై మీ కామెంట్.

Similar News

News February 15, 2025

భారత్‌లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.

News February 15, 2025

మహాకుంభమేళా.. 20,000 మంది ఆచూకీ లభ్యం

image

కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20K మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో UNICEF, NGOలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

News February 15, 2025

ఆమెకు 74 ఏళ్లు.. అయితేనేం!

image

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్‌ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌‌కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్‌కు 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.

error: Content is protected !!