News July 26, 2024
Asia Cup: అదరగొట్టిన భారత్.. బంగ్లా స్కోర్ 80/8
ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో భారత మహిళలు అదరగొట్టారు. బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 80/8 స్కోరుకే కట్టడి చేశారు. రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో నిగర్ సుల్తానా(32), షోర్న అక్తర్(19) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమ్ ఇండియా విజయం కోసం 81 పరుగులు చేయాలి.
Similar News
News October 11, 2024
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్
AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
News October 11, 2024
ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం
ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.
News October 11, 2024
యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?
ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.