News September 11, 2025
ASIA CUP: బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-బీ టీమ్స్ బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. నిజాఖత్ ఖాన్ 42, జీషన్ అలీ 30, యాసిమ్ 28 రన్స్‌తో రాణించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్, టాంజిమ్, రిషాద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. 144 రన్స్ లక్ష్యంతో కాసేపట్లో బంగ్లా ఛేజింగ్ ఆరంభించనుంది.
Similar News
News March 26, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ఆసిఫాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డిలో ఉరుములు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, WGL, జనగామ, SDPT, యాదాద్రి, RR, మేడ్చల్, MBNR, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, PDPL, నాగర్ కర్నూల్, వనపర్తి, NRPT, GDWL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
రాష్ట్రంలో కాగితాలపైనే పోలీసులు: జగన్

AP జంగిల్ రాజ్‌గా మారిపోయిందని, కాగితాలపై మాత్రమే పోలీసులు కన్పిస్తున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో 17ఏళ్ల గిరిజన బాలికపై హత్యాచారం వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. ఇక ఇవాళ మార్కాపురం ఘటనలో మరో భయానక వైఫల్యం బయటపడిందన్నారు. పలుమార్లు 100కు ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పారు. CBN ప్రభుత్వంలో PR స్టంట్లు తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు.
News March 26, 2026
ఆధార్ ఉన్నవారికి గుడ్‌న్యూస్

ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం. కానీ కొన్నిచోట్ల ఫిజికల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని అధికారులు చెబుతుంటారు. ఇలాంటి నిబంధనలతో చాలామంది నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారికి ఉడాయ్ ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. తాము జారీ చేసిన ఏ తరహా ఆధార్ అయినా సమానమేనని తేల్చి చెప్పింది. ఆధార్ లెటర్, ఈ-ఆధార్, యాప్‌లో ఆధార్, ఆధార్ PVC కార్డ్ అన్నీ ఒకటేనని పేర్కొంది.


