News November 19, 2024

అస్సాం సీఎం కీలక నిర్ణయం

image

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును ‘శ్రీభూమి’గా మారుస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారు. 100ఏళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష, ఆశయాలను ప్రతిబింబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 14, 2024

అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరు విడుదల

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

News December 14, 2024

రాష్ట్రంలో 9లక్షల కేసులు పెండింగ్

image

AP: రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ MP పుట్టా మహేశ్ లో‌క్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఏపీ హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.

News December 14, 2024

ఆ జిల్లాలకు వర్ష సూచన

image

AP: రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17న రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.