News December 17, 2024
స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
BRS, BJP సభ్యుల ఆందోళనల మధ్యే తెలంగాణ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుతో పాటు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. మరోవైపు లగచర్ల ఘటన, రైతుకు బేడీలు వేసిన ఘటనలపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి.
Similar News
News January 14, 2025
రోడ్డు ప్రమాదం.. మంత్రికి తప్పిన ముప్పు
కర్ణాటక మంత్రి హెబ్బాల్కర్ లక్ష్మి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బెళగావి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు టర్న్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంత్రి ముఖం, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి.
News January 14, 2025
Stock Markets: లాభాల్లో పరుగులు..
స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూచీలు ఎక్కువ పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఆకర్షణీమైన షేర్లను కొనుగోలు చేస్తున్నారు. నిఫ్టీ 23,201 (+116), సెన్సెక్స్ 76,717 (+387) వద్ద ట్రేడవుతున్నాయి. FMC, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లకు డిమాండ్ ఉంది. ADANIENT, NTPC, INDUSIND, TATAMOTORS, ADANIPORTS టాప్ గెయినర్స్.
News January 14, 2025
సంక్రాంతి.. ఆత్మీయులతో ఆనందంగా..
సంక్రాంతి పండగ పుణ్యాన అయినవాళ్లందరూ ఒక్కచోట చేరారు. రోజూ పనిలో బిజీగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికోసారి వచ్చే ఈ విలువైన సమయంలోనైనా కంప్యూటర్, ఫోన్, టీవీ అంటూ గడిపేయకండి. మీ పిల్లలను ఊళ్లో తిప్పండి. పెద్దవాళ్లను పరిచయం చేయండి. పంటపొలాలు చూపించండి. సంప్రదాయ ఆటలు ఆడండి. ఆత్మీయులతో మనసారా మాట్లాడుతూ ఆనందంగా గడపండి.