News December 16, 2024
నేటి నుంచి అసెంబ్లీ.. సభ ముందుకు రెండు బిల్లులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733725579823_893-normal-WIFI.webp)
TG: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో నేడు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉ.10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ MLAలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. ఈరోజు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Similar News
News January 20, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737307876599_1226-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 20, 2025
భారత్‌పై WEF చీఫ్ ప్రశంసల వర్షం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737312086918_1226-normal-WIFI.webp)
వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్(WEF) చీఫ్ బోర్గే బ్రెండే భారత్ వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 20% ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విద్యా, పరిశోధనల్లో సంస్కరణల సాయంతో భారత వృద్ధి రేటు 7-8% చేరుకుంటుందని అంచనా వేశారు. భారత్‌లో లక్షకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని చెప్పారు. ఇవే భవిష్యత్తు వృద్ధికి ఆధారమని పేర్కొన్నారు.
News January 20, 2025
ఈరోజు నమాజ్ వేళలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737306476667_1226-normal-WIFI.webp)
✒ తేది: జనవరి 20, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు
✒ ఇష: రాత్రి 7.21 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.