News July 20, 2024

ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.

Similar News

News December 26, 2024

భాగ‌వ‌త్‌తో విభేదించిన RSS మ్యాగ‌జైన్‌

image

మసీదు-మందిర్ వివాదాల‌పై RSS చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగ‌జైన్ విభేదించింది. ఈ త‌ర‌హా వివాదాలు అధిక‌మ‌వుతుండ‌డంపై భాగ‌వ‌త్ గ‌తంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భార‌తీయులు క‌లిసి ఉండ‌గ‌ల‌ర‌న్న ఐక్య‌త చాటాల‌ని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగ‌జైన్ మాత్రం సివిలైజేష‌న్ జ‌స్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.

News December 26, 2024

ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్

image

తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News December 26, 2024

ఇండియన్స్‌కు తక్కువ జీతం ఇవ్వొచ్చు : అమెరికా కంపెనీ ఫౌండర్

image

భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్‌‌ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.