News February 24, 2025

నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

image

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News November 25, 2025

ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

image

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in