News February 4, 2025

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా

image

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శ్రీధర్ బాబు విజ్ఞప్తితో స్పీకర్ సభను మ.2 గంటలకు వాయిదా వేశారు.

Similar News

News February 8, 2025

ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన ఇదే

image

మస్తాన్ సాయి <<15351108>>ప్రైవేట్ వీడియోల<<>> వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

News February 8, 2025

శ్రీకాకుళంలోని ఆ 104 గ్రామాల్లో ‘తండేల్’ కథలే!

image

AP: శ్రీకాకుళం (D) K.మత్య్సలేశంకు చెందిన రామారావు, కొందరు జాలర్ల వాస్తవిక జీవితం ఆధారంగా తీసిన మూవీ ‘తండేల్’. అయితే జిల్లాలోని 193KM తీర ప్రాంతంలో ఉన్న 104మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి కథలే కన్పిస్తాయి. ఫిషింగ్ హార్బర్లు లేక కొందరు నాటు పడవలపై ప్రమాదకరంగా చేపల వేట చేస్తున్నారు. వేలాదిగా ముంబై, వీరావల్(గుజరాత్) పోర్టులకు వలస వెళ్లి వ్యాపారుల వద్ద పనుల్లో చేరి దాదాపు సముద్రానికే అంకితమవుతున్నారు.

News February 8, 2025

27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్‌ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనిపై మీ కామెంట్.

error: Content is protected !!