News April 4, 2024
10లక్షల మందితో సభ.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం

TG: తుక్కుగూడలో ఎల్లుండి జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో కలిసి వెళ్లిన ఆయన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించే వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. 10 లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరుకానున్న ఈ సభలోనే జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Similar News
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.
News April 16, 2026
పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించండి: గోయెంకా

పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపుపై అవగాహన కల్పించాలని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సూచించారు. వారి ఆదాయాన్ని (పాకెట్ మనీ) మూడు భాగాలుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు. ఒకటి పొదుపు/పెట్టుబడి కోసం, రెండోది వ్యక్తిగత వినోదం కోసం, మూడోది కుటుంబ ఉమ్మడి లక్ష్యాల కోసం ‘హోమ్ ట్యాక్స్’గా కేటాయించాలని తెలిపారు. ఈ విధానం వల్ల పిల్లల్లో బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
News April 15, 2026
మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్‌కు లేదు: ఖర్గే

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.


