News April 5, 2024
ఆస్తి రూ.123 కోట్లు.. అప్పు రూ.1.4 కోట్లు
బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. తనకు సుమారు రూ.123 కోట్ల ఆస్తులు, రూ.1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలిని వద్ద రూ.13.5 లక్షలు, ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ వద్ద రూ.43 లక్షల నగదు ఉంది. విలువైన కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి.
Similar News
News January 14, 2025
ఎమ్మెల్యే కౌశిక్‌కు బెయిల్ మంజూరు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన రిమాండ్ రిపోర్టును జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించారని, ఎమ్మెల్యే సంజయ్‌ను దుర్భాషలాడారని 3 కేసులు నమోదు కాగా నిన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి బెయిల్ ఇచ్చారు. రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు.
News January 14, 2025
ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య
సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, BRS అధినేత కేసీఆర్, బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. చంద్రబాబు కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలయ్య కింద డాకు మహారాజ్, కేసీఆర్ కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. ఆ ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎవరు దీన్ని పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది.
News January 14, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్
సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో మూవీ టీమ్ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని పేర్కొంది.