News September 14, 2024
స్పేస్ నుంచే ఓటు వేయనున్న వ్యోమగాములు
NASA వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. FEB 2025లో వారు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే NOV 5న జరిగే USAలో ఎన్నికల్లో వారు అక్కడి నుంచే ఓటు వేయనున్నారు. ఇందుకోసం NASA ఏర్పాట్లు చేసింది. ఇలా ఓటు వేయడం ఇది తొలిసారి కాదు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి వీలు కల్పించే బిల్లును US ఆమోదించింది. 1997 నుంచి వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేస్తున్నారు.
Similar News
News October 12, 2024
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ
ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.
News October 12, 2024
భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి ఆదేశాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.
News October 12, 2024
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం
TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.