News August 5, 2024
ఆ టైంలో చెట్లు బ్రీతింగ్ ఆపేస్తాయ్!

మనుషుల్లాన్లే చెట్లూ శ్వాసక్రియ జరుపుతుంటాయి. C02ని పీల్చుతూ ఆక్సిజన్‌ను వదులుతుంటాయి. చెట్ల ఆకులు ఈ ప్రక్రియ నిర్వహిస్తుంటాయి. అయితే కార్చిచ్చుల వేళ వెలువడే హానికర వాయువుల నుంచి రక్షించుకునేందుకు కొన్ని చెట్లు బ్రీతింగ్ ఆపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో చెట్ల ఆకుల రంద్రాలు మూసుకుపోయాయని, కిరణజన్య సంయోగక్రియ సైతం ఆగినట్లు తెలిపారు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు.
Similar News
News December 2, 2025
శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

‘దిత్వా’ తుఫానుతో నష్టపోయిన శ్రీలంకకు అండగా ఉంటామని PM మోదీ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సాయం అందిస్తామన్నారు. శ్రీలంకలో తుఫాను బీభత్సానికి 300మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారు. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామగ్రిని పంపిన భారత్‌కు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు.
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


