News August 5, 2024

ఆ టైంలో చెట్లు బ్రీతింగ్ ఆపేస్తాయ్!

image

మనుషుల్లాన్లే చెట్లూ శ్వాసక్రియ జరుపుతుంటాయి. C02ని పీల్చుతూ ఆక్సిజన్‌ను వదులుతుంటాయి. చెట్ల ఆకులు ఈ ప్రక్రియ నిర్వహిస్తుంటాయి. అయితే కార్చిచ్చుల వేళ వెలువడే హానికర వాయువుల నుంచి రక్షించుకునేందుకు కొన్ని చెట్లు బ్రీతింగ్ ఆపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో చెట్ల ఆకుల రంద్రాలు మూసుకుపోయాయని, కిరణజన్య సంయోగక్రియ సైతం ఆగినట్లు తెలిపారు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు.

Similar News

News September 17, 2024

మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు!

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ మహిళా లాయర్లపై యాసిడ్ పోస్తామని, రేప్ చేస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

News September 17, 2024

కోల్‌కతాకు కొత్త కమిషనర్ నియామకం

image

కోల్‌కతాకు నూతన పోలీస్ కమిషనర్‌గా మనోజ్ వర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో కమిషనర్‌ను మార్చాలని వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో వినీత్ గోయల్ స్థానంలో మమత సర్కార్ ఆయనను నియమించింది.

News September 17, 2024

పూసింది.. పూసింది ‘నీలకురింజి’

image

ఊటీలోని ఎప్పనాడు, బిక్కనాడు కొండ ప్రాంతాల్లో 12 ఏళ్లకు ఓసారి పూసే నీలకురింజి పూలు వికసించాయి. ఈ సుందర దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. వీటి శాస్త్రీయ నామం ‘స్ట్రోబిలాంతెస్ కుంతియానా’. కొండ ప్రాంతాల్లో 1300-2400 మీటర్ల ఎత్తులో ఈ పూల మొక్కలు పెరుగుతుంటాయి. మొక్క 30- 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఊదా నీలం రంగులో ఉండే ఈ పూల కారణంగానే నీలగిరి పర్వత శ్రేణులకు ఆ పేరు వచ్చింది.