News February 9, 2025
సీఎం పదవికి ఆతిశీ రాజీనామా

ఢిల్లీ సీఎం పదవికి ఆతిశీ మార్లేనా రిజైన్ చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేశారు. కాగా నిన్న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టింది.
Similar News
News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
News March 25, 2025
BSNL యూజర్లకు అలర్ట్

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 25, 2025
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్‌లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.