News December 25, 2024

ఆతిశీని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా, Sr నేతలను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో 5 రోజుల్లో వీరిపై ఫేక్ కేసులు బనాయిస్తారని BJPని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ ఈ మధ్యే ప్రకటించిన CM మహిళా సమ్మాన్ యోజన, సంజీవనీ యోజన వారిని ఇరుకున పెట్టాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ట్వీట్ చేశారు.

Similar News

News March 13, 2026

CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్‌సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.

News March 13, 2026

కోమాలో మొజ్తబా ఖమేనీ: UK మీడియా

image

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని UK మీడియా చెబుతోంది. ఆయన ఒక కాలు కోల్పోయారని, పొట్ట/లివర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని అంటోంది. అయితే <<19348883>>అలీ ఖమేనీ<<>> చనిపోయిన రోజే గాయపడ్డారా, లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే <<19365703>>మొజ్తబా హెచ్చరించారంటూ<<>> ఇరాన్ ప్రభుత్వ TV ప్రకటన చేసింది. దీంతో ‘కోమాలో ఉన్నప్పటికీ USకు మొజ్తబా వార్నింగ్ ఇచ్చారు’ అని బ్రిటన్ మీడియా సెటైర్స్ వేసింది.

News March 12, 2026

ఫోన్ పే, గూగుల్ పే‌లో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

image

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.