News September 15, 2024
అట్లీ-అల్లు అర్జున్ కాంబో.. బిగ్ అప్డేట్?
అల్లు అర్జున్, అట్లి కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ నిర్మించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్‌తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న విడుదల కానుంది.
Similar News
News October 13, 2024
జైలులో నాటకం.. సీతను వెతుకుతూ ఖైదీల పరార్
ఉత్తరాఖండ్‌లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
News October 13, 2024
మాజీ మంత్రి హత్య.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్
మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.
News October 13, 2024
మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?
వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.