News March 24, 2025

మే 1 నుంచి ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపు

image

ATM ఇంటర్‌ఛేంజ్(ఒక బ్యాంకు మరో బ్యాంకుకు చెల్లించేది) ఫీజుల పెంపునకు RBI ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర ట్రాన్సాక్షన్లకు రూ.1 ఛార్జీలను పెంచింది. కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో క్యాష్ విత్‌డ్రా సేవలకు రూ.19, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇతర సేవలకు రూ.7 ఛార్జ్ ఉండనుంది. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు బ్యాంకులు కస్టమర్లమైనే భారం వేసే అవకాశముంది.

Similar News

News April 23, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.

News April 23, 2025

ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

image

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.

News April 23, 2025

స్కూళ్లకు సెలవులు షురూ

image

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.

error: Content is protected !!