News April 7, 2024

దారుణం.. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు

image

పంజాబ్ తరన్ తారన్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ(55)పై కొందరు దుండగులు దాడి చేసి, అర్ధనగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవుతోంది. బాధితురాలి కుమారుడు ఇటీవల ఓ మహిళతో పారిపోయి, ఆమె కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో మహిళ తల్లి, సోదరులు.. ఒంటరిగా ఉన్న యువకుడి తల్లిపై దాడి చేశారు. వస్త్రాలు చింపి, గ్రామంలో అర్ధనగ్నంగా ఊరేగించారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

Similar News

News November 12, 2024

ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు: ET

image

ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.

News November 12, 2024

దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ల విలువ తెలిస్తే షాకవుతారు!

image

ఇండియా గ్రోత్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై దేశీయ ఇన్వెస్టర్ల నమ్మకం మరింత బలపడింది. మార్కెట్ సెంటిమెంటును పట్టించుకోకుండా దీర్ఘకాల దృక్పథంతో మెచ్యూరిటీతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడే ఇందుకో ఉదాహరణ. ప్రస్తుతం MF AUM ఆల్‌టైమ్ హై రూ.67.26 లక్షల కోట్లకు చేరడం విశేషం. రిటైల్ ఫోలియోస్ 17.23 కోట్లు, SIP అకౌంట్లు 10 కోట్లు దాటేశాయి. మంత్లీ సిప్ ఇన్‌ఫ్లో రూ.25వేల కోట్లంటే మాటలు కాదు.

News November 12, 2024

DANGER: స్నానానికి స్క్రబ్స్ వాడుతున్నారా?

image

సబ్బు, బాడీ వాష్‌లకు అదనంగా చర్మం మృదువుగా మారడానికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి స్క్రబ్స్‌(సింథటిక్/ప్లాంట్ ఫైబర్)ను వాడటం పెరిగింది. అయితే వీటిని ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తగలకపోవడం వల్ల స్క్రబ్స్‌పై బాక్టీరియా, సూక్ష్మక్రిములు, బూజు పేరుకుపోతాయంటున్నారు. దీంతో చర్మ వ్యాధులు, అలర్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.