News November 14, 2024
దారుణం: అత్యాచారం చేసి, ఎముకలు విరగ్గొట్టి..
కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోతోంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో కుకీ తెగకు చెందిన మహిళా టీచర్(31)పై అనుమానిత మెయితీ దుండగులు అత్యాచారం చేసి దహనం చేసిన కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆమె శరీరం 99% కాలిపోవడంతో అత్యాచార నమూనాలు తీయడం సాధ్యం కాలేదు. 8 చోట్ల గాయాలున్నాయి. ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. పుర్రె వేరుపడింది’ అని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది.
Similar News
News December 7, 2024
‘పుష్ప-2’ను అతను కూడా డైరెక్ట్ చేశారు: సుకుమార్
పుష్ప సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు రాజమౌళి అని సుకుమార్ అన్నారు. ‘పుష్ప-2’ను హిందీలో రిలీజ్ చేయాలని జక్కన్న పట్టుబట్టారని చెప్పారు. ’పుష్ప-2’లో చైల్డ్ హుడ్ సీన్, ట్రక్ సీన్‌తో పాటు 40 శాతం సినిమాను తన అసిస్టెంట్ శ్రీమన్ డైరెక్ట్ చేశారన్నారు. మూవీకి డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమన్ అని వేయాల్సి ఉందని తెలిపారు. తన టీమ్‌లో అందరూ సుకుమార్‌లేనని పేర్కొన్నారు.
News December 7, 2024
మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా
TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.
News December 7, 2024
3వ క్వార్టర్‌లో పుంజుకుంటాం: FM నిర్మల
సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు క్షీణించడం వ్యవస్థాగత మందగమనాన్ని సూచించవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 3వ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని రాబోయే రోజుల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా, మూలధన వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల 2వ త్రైమాసికంలో అభివృద్ధి మందగించిందన్నారు.