News September 26, 2024
అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి
అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరాన్ని కొందరు దుండగలు అపవిత్రం చేశారు. గోడలపై గ్రాఫిటీతో ‘హిందువులు వెళ్లిపోండి’ అని రాశారు. 10 రోజుల క్రితం న్యూయార్క్‌లోని బాప్స్ ఆలయాన్నీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ హేట్ క్రైమ్స్‌ను సంఘటితంగా ఎదుర్కొంటామని హిందూ సంఘాలు తెలిపాయి. అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఈ దాడుల్ని ఖండించారు.
Similar News
News October 5, 2024
శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఓపెనర్‌గా బరిలోకి
బంగ్లాదేశ్‌తో T20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వస్తారని కెప్టెన్ సూర్య కుమార్ ప్రకటించారు. సంజూతో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగుతారని చెప్పారు. కాగా ఈ సిరీస్‌లో రాణిస్తే సంజూకి జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంది. అటు అతడికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడం, వచ్చినా ఉపయోగించుకోలేకపోవడంతో జట్టులో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఈ సిరీస్ సంజూకి గోల్డెన్ ఛాన్స్ కానుంది.
News October 5, 2024
నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి
వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News October 5, 2024
ఆరోజున ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ వెల్లువ?
ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. రాజాసాబ్ నుంచి టీజర్, హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన టైటిల్ రివీల్, కల్కి-2 నుంచి అప్‌డేట్, సందీప్ వంగా ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు డార్లింగ్, ఈశ్వర్ మూవీస్ రీ-రిలీజ్ ఉండటంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు రెబల్ ఫ్యాన్స్.