News March 17, 2024
వ్యభిచార గృహంపై దాడి… కేసు నమోదు

కల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అక్కడకు సుజాతనగర్కు చెందిన ఇద్దరు వచ్చారు. ఆ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఇదే ఇంటి వద్ద ఇదే ఘటనపై కేసు నమోదైంది. దీంతో ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షాకీర్ తెలిపారు.
Similar News
News September 7, 2025
ఖమ్మం: రేపు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
News September 7, 2025
ఖమ్మం: నవంబరు 23న ఉపకార వేతన పరీక్ష

2025-26 విద్యాసంవత్సరంలో నవంబరు 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఆన్ లైన్లో చెల్లించాలని సూచించారు.
News September 6, 2025
ఖమ్మం: తరగతి గదిలో టీచర్ల పాత్ర కీలకం

సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.