News March 17, 2024
వ్యభిచార గృహంపై దాడి… కేసు నమోదు
కల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అక్కడకు సుజాతనగర్‌కు చెందిన ఇద్దరు వచ్చారు. ఆ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గతంలో ఇదే ఇంటి వద్ద ఇదే ఘటనపై కేసు నమోదైంది. దీంతో ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షాకీర్ తెలిపారు.
Similar News
News October 6, 2024
దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: మంత్రి
ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అటువంటివి తాము చేయమన్నారు.
News October 5, 2024
రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి
రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.
News October 5, 2024
KTDM: సమాధి వద్దే సూసైడ్ అటెంప్ట్
ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్‌కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.