News October 7, 2025
CJIపై దాడి.. పశ్చాత్తాపం లేదన్న లాయర్

CJI గవాయ్‌పై దాడి పట్ల తనకు పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ తెలిపారు. ఖజురహోలోని విష్ణువు విగ్రహ పునరుద్ధరణపై ఆయన వ్యాఖ్యలు అవమానకరంగా అనిపించాయని, తనతో దైవమే ఇలా దాడి చేయించిందన్నారు. తాను జైలుకెళ్లేందుకూ సిద్ధమని మీడియాతో చెప్పారు. ఈ పని పట్ల తన కుటుంబం అసంతృప్తితో ఉందని, తనను అర్థం చేసుకోవడం లేదన్నారు. తన మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. అరెస్టైన కొన్ని గంటల్లోనే ఆయన విడుదలయ్యారు.
Similar News
News October 7, 2025
తూర్పుగోదావరి జిల్లాలో జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఈనెల 8న 1014 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 23 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, బీబీఏ, ఎంఎస్సీ అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 నుంచి 35ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
News October 7, 2025
బండి నడుపుతూ పాటలు వింటున్నారా?

TG: వాహనాలు నడుపుతూ ఫోన్‌లో వీడియోలు చూసేవారికి, హెడ్ ఫోన్‌లో పాటలు వినే వారికి హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అది చాలా ప్రమాదకరం అని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో, క్యాబ్/బైక్ ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత దానిపైనే పెట్టాలని సూచించారు.
News October 7, 2025
ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

అత్యధిక(1,638) వాలిడ్ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా భారత్‌కు చెందిన మనీశ్ ధామేజా పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. తనకు క్రెడిట్ కార్డ్స్ ఇష్టమని, వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, బెనిఫిట్స్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సమయంలో అవి చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఇదే కాకుండా 10L+ నాణేలు సేకరించిన గిన్నిస్ రికార్డు కూడా ఆయన సొంతం. కాగా ఓ వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు.