News November 28, 2024

ఈడీ అధికారులపై దాడి

image

సైబర్ నేరాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుపై ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ బృందంపై దుండగులు కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులు అశోక్ శర్మ, అతని సోదరుడిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఫిషింగ్, క్యూఆర్ కోడ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి వేలాది స్కామ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధుల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది.

Similar News

News November 28, 2024

మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా

image

AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు.

News November 28, 2024

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?

image

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?

News November 28, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.