News January 18, 2025

సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 25, 2025

జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

image

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.

News November 25, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలు

image

<>బల్మెర్ లారీ<<>> 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 19వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. నెలకు రూ.40వేల నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.