News January 18, 2025
సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 13, 2025
సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి

TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
News February 13, 2025
ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం

భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.
News February 13, 2025
అమెరికా నిఘా డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్

భారత సంతతి వ్యక్తి తులసీ గబ్బార్డ్‌ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్‌గా అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా అక్కడి 18 నిఘా సంస్థల కార్యకలాపాలను తులసి పర్యవేక్షిస్తారు. కీలక సమస్యలపై ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తారు. అమెరికాపై 2001లో ఉగ్రదాడుల అనంతరం ఈ పదవిని ఏర్పాటు చేశారు.