News November 11, 2024
కలెక్టర్‌పై దాడి.. లగచర్లలో భారీగా పోలీసుల మోహరింపు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఫార్మావిలేజ్‌కు భూసేకరణ విషయంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
Similar News
News December 9, 2024
లోన్ తిప్పలు: ₹39 వేల కోడి మాంసం ఆరగించిన బ్యాంకు మేనేజర్
లోన్ అప్రూవ్ చేయడానికి ఓ కస్టమర్ నుంచి ₹39 వేల కోడి మాంసం ఆరగించాడో బ్యాంకు మేనేజర్. ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరీకి చెందిన రూప్‌చంద్ పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ₹12 లక్షల రుణం కోసం SBI మేనేజర్‌ను కలిశారు. ఆయన 10% కమీషన్ తీసుకున్నారు. అలాగే ప్రతి శనివారం చికెన్ పంపాల్సిందిగా ఆదేశించారు. ₹39K కోడి మాంసం ఆరగించినా లోన్ మంజూరు చేయకపోవడంపై బాధితుడు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
News December 9, 2024
‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్
INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
News December 9, 2024
నాగబాబుకు మంత్రి పదవి
AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.