News March 5, 2025

దాడులు, హత్యలు.. రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు

image

AP: పల్నాడు జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం, తిరిగివ్వకపోతే దాడులు చేయడం పెరిగిపోతోంది. ఇటీవల సత్తెనపల్లిలో సుభాని అనే వడ్డీ వ్యాపారి అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేశాడు. అలాగే చిన్నమాబు అనే వ్యాపారి తరుణ్‌ అనే యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయని, వడ్డీ రాక్షసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.

Similar News

News February 9, 2026

మున్సిపోల్: సాయంకాలానికి అంతా SILENT

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, BJP నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, BRS నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.

News February 9, 2026

పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

image

పూజా ద్రవ్యాలను గౌరవించాలి. అందులో ఉపయోగించే గంట, శంఖం, తమలపాకులతో పాటు ఏ వస్తువులనూ నేరుగా నేలపై ఉంచకూడదు. వీటిని పీఠంపై లేదా ఓ పళ్లెంలో ఉంచాలి. అలాగే, భగవంతునికి సమర్పించే పువ్వుల రెక్కలను విడదీసి పూజించడం నిషిద్ధం. పువ్వును వికసించిన రూపంలోనే అర్పించాలి. పూజా సమయంలో శక్తివంచన ఉండకూడదు. ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు. కేవలం కుడిచేతితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.

News February 9, 2026

క్యారెట్‌తో ఎన్ని ప్రయోజనాలో?

image

క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.