News March 5, 2025
దాడులు, హత్యలు.. రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు

AP: పల్నాడు జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం, తిరిగివ్వకపోతే దాడులు చేయడం పెరిగిపోతోంది. ఇటీవల సత్తెనపల్లిలో సుభాని అనే వడ్డీ వ్యాపారి అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేశాడు. అలాగే చిన్నమాబు అనే వ్యాపారి తరుణ్ అనే యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయని, వడ్డీ రాక్షసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.
Similar News
News March 11, 2026
చైనా FDIలు.. వ్యూహాత్మక గాలమా?

గల్వాన్ ఘర్షణ తర్వాత టిక్‌టాక్ బ్యాన్, చైనా వస్తువుల బహిష్కరణతో దేశం హోరెత్తిపోయింది. కానీ నేడు సీన్ మారింది. చైనా కంపెనీల <<19346681>>పెట్టుబడులకు<<>> (FDI) కేంద్రం రూల్స్ మార్చింది. ఇది వ్యూహాత్మక మార్పా? లేక ఆర్థిక అవసరమా? అనే చర్చ జరుగుతోంది. దేశీయ తయారీ రంగం బలోపేతం కోసం డ్రాగన్‌తో చేతులు కలిపిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే చైనాను దారితెచ్చుకోవడానికి వేసిన గాలం అని మరికొందరు అంటున్నారు.
News March 11, 2026
ఫిరాయింపు MLAల కేసు.. సంచలన తీర్పు

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారు పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. స్పీకర్ తాజా నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ లభించినట్లయింది.
News March 11, 2026
IPL-2026: ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే?

ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ తలపడబోవని క్రిక్‌బజ్ తెలిపింది. బెంగళూరు, పంజాబ్ వేర్వేరుగా ఆడనున్నాయని పేర్కొంది. సంప్రదాయం ప్రకారం హై ప్రొఫైల్ మ్యాచుతో టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మార్చి 28న బెంగళూరు-చెన్నై మధ్య జరిగే అవకాశం ఉందని తెలిపింది. రన్నరప్ అయిన పంజాబ్ 29న GTతో ఆడవచ్చని వెల్లడించింది. కాగా మార్చి 12/13న IPL షెడ్యూల్ రిలీజ్ కానుంది.


