News August 7, 2024

డ్రగ్స్ కొనుగోలుకు యత్నం.. హాకీ ప్లేయర్ అరెస్ట్

image

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా కొకైన్ కొనుగోలుకు యత్నించిన ఆసీస్ హాకీ ప్లేయర్ క్రైగ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ 17 ఏళ్ల కుర్రాడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ కూడా ధ్రువీకరించింది. కాగా నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఆసీస్ 2-0 తేడాతో ఓడిపోయింది.

Similar News

News September 10, 2024

చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి

image

భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.

News September 10, 2024

టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్

image

టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.

News September 10, 2024

భారత్ రానున్న జెలెన్‌స్కీ?

image

ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.