News August 5, 2024
స్వయంప్రతిపత్తిని లాక్కొనే ప్రయత్నం: అసదుద్దీన్ ఒవైసీ

మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వక్ఫ్ బోర్డ్ స్వయంప్రతిపత్తిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలు అమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు.
Similar News
News January 10, 2026
తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 KM వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రంలోపు ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
News January 10, 2026
‘గోవిందా!’ అని అందామా?

గోవింద నామమంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. ‘గో’ అంటే గోవులే కాదు! వేదాలు, కిరణాలు, సమస్త జీవులని అర్థం. జీవులందరినీ జ్ఞానంతో, ఆహారంతో పోషించేవాడే గోవిందుడు. ఓసారి అగస్త్యుడు ఆవును తీసుకోమని ‘గో ఇంద’ (ఆవును తీసుకో) అని స్వామిని పిలవగా ఆ పిలుపే ‘గోవింద’ నామంగా మారిందని పురాణ గాథ. భక్తితో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే, ఆయన ఏడుకొండలు దిగి వచ్చి మనల్ని ఆదుకుంటాడు. గోవింద నామ స్మరణ మోక్షానికి సులభ మార్గం.
News January 10, 2026
శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

మకరజ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వచ్చే అవకాశం ఉండటంతో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని తెలిపారు. ఇక జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజున ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అయ్యప్ప భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.


