News August 5, 2024

స్వ‌యంప్ర‌తిప‌త్తిని లాక్కొనే ప్ర‌య‌త్నం: అసదుద్దీన్ ఒవైసీ

image

మ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించేలా వ‌క్ఫ్ బోర్డ్ స్వ‌యంప్ర‌తిప‌త్తిని లాక్కోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ విమ‌ర్శించారు. వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలు అమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్‌ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు.

Similar News

News September 18, 2024

మళ్లీ టెన్షన్: అరుణాచల్ సమీపంలో చైనా హెలీపోర్ట్ నిర్మాణం

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఫిష్‌టెయిల్ ప్రాంతానికి సమీపంలో LAC వద్ద 20KM దూరంలో చైనా హెలీపోర్ట్ నిర్మించడం మళ్లీ టెన్షన్ పెంచుతోంది. మెరుగైన సదుపాయాల్లేని ఈ ప్రాంతంలోకి అత్యంత వేగంగా మిలిటరీ సామగ్రిని తరలించేందుకే దీనిని నిర్మించారని సమాచారం. 2023, డిసెంబర్ 1కి ముందు అక్కడేమీ లేదని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. చైనా నియంత్రణలోని టిబెట్‌లో దీనిని నిర్మించడంతో భారత్ అభ్యంతరం చెప్పలేకపోతోంది.

News September 18, 2024

రాజకీయ పార్టీల ఫ్రీబీస్‌పై విచారిస్తాం: సుప్రీం కోర్టు

image

ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. అవతలిపక్షం వాదనలు వినాల్సి ఉండటంతో పిల్‌ను నేడు విచారించడం కుదరదంది. కాజ్‌లిస్టు నుంచి డిలీట్ చేయబోమని CJI చంద్రచూడ్, జస్టిస్‌లు పార్థివాల, మనోజ్ మిశ్రా బెంచ్ పేర్కొంది. ఫ్రీబీస్ హామీలిచ్చే పార్టీల గుర్తుల్ని నిలిపేయాలని, వాటి గుర్తింపు రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ మార్చి 20న ఓ లాయర్ ఈ పిల్ వేశారు.

News September 18, 2024

గ్రామీణ యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!

image

బిహార్ అనగానే వలసలు, గొడవలే గుర్తొస్తాయి. కానీ, తమలోనూ ఎంతో ప్రతిభ ఉందని జము ఖరియాకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అభిషేక్ కుమార్ నిరూపించారు. గ్రామీణప్రాంతానికి చెందిన అతను లండన్‌లోని గూగుల్ కంపెనీలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. NIT పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022లో Amazonలో ₹1.08 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందారు. తాజాగా గూగుల్‌లో జాబ్ సాధించారు.