News November 27, 2024
ఫ్యాన్సీ నంబర్ల వేలం.. రవాణాశాఖకు కాసుల పంట

TG: ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీగా డబ్బులు వచ్చాయి. TG 09D 0001 నంబర్‌ను ఓ వ్యక్తి రూ.11,11,111 వెచ్చించి దక్కించుకున్నారు. ఇదే సిరీస్‌లో 0009 నంబర్‌ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రూ.10.40 లక్షలకు దక్కించుకుంది. TG 09 సీ 9999 నంబర్‌ను శ్రీయాన్ కన్‌స్ట్రక్షన్స్ రూ.7.19 లక్షలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా నిన్నటి వేలంలో రూ.52.52 లక్షల ఆదాయం సమకూరింది.
Similar News
News November 7, 2025
న్యూస్ అప్‌డేట్స్ @10AM

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం
News November 7, 2025
నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
News November 7, 2025
లావెండర్ నూనెతో మేనికి మెరుపు

అందాన్ని పెంచడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ కీలకంగా పనిచేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది లావెండర్ ఆయిల్. దీన్ని ఎలా వాడాలంటే..* 2చుక్కల లావెండర్ నూనెని పావుకప్పు బ్రౌన్ షుగర్‌లో కలిపి, స్నానం చేసేముందు ఒంటికి రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలు, యాక్నేను తగ్గిస్తుంది. * అరటిపండు గుజ్జు, తేనె, 2చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.


