News August 11, 2025
ఆగస్టు 11: చరిత్రలో ఈ రోజు

1908: స్వాతంత్య్ర సమరవీరుడు ఖుదీరాం బోస్(ఫొటోలో) మరణం
1943: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జననం
1949: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జననం
1960: చాద్ స్వాతంత్ర్య దినోత్సవం
1961: నటుడు సునీల్ శెట్టి జననం
2000: నటుడు, నిర్మాత పైడి జైరాజ్ మరణం
2008: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అభినవ్ బింద్రా
Similar News
News August 13, 2025
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్

TG: మద్యం వినియోగంలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు NIPFP స్టడీలో తేలింది. జాతీయ సగటు రూ.486 ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం (రూ.1,45,261) అగ్రస్థానంలో ఉంది.
News August 13, 2025
రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్

AP: 2 కేంద్రాల్లో రీ పోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్య తీసుకుందని YCP MP అవినాశ్ రెడ్డి విమర్శించారు. తాము 15 చోట్ల కోరితే 2 చోట్ల పోలింగ్ చేపట్టారని, దీన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ‘కోర్టుకు ఏదో కారణం చెప్పడానికే రీ పోలింగ్ చేపట్టింది. ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగ ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నిక ఎక్కడా జరిగి ఉండదు. పులివెందులలో బాబు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు’ అని ఫైర్ అయ్యారు.
News August 13, 2025
వచ్చే నెల ట్రంప్‌తో మోదీ భేటీ?

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.