News August 14, 2025
ఆగస్టు 14: చరిత్రలో ఈ రోజు

1947: విభజన గాయాల సంస్మరణ దినం
1947: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
1957: కమెడియన్ జానీ లీవర్ జననం
1968: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
2011: బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ మరణం
2012: మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం
1983: సింగర్ సునిధి చౌహాన్ జననం
Similar News
News August 14, 2025
IMPS చెల్లింపులపై ఛార్జీలు పెంపు: SBI

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) చెల్లింపులపై ఛార్జీలను పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీల్లో మార్పులేదు. ఆన్‌లైన్‌లో 25 వేలు-రూ.లక్షలోపు రూ.2, రూ.లక్ష-2 లక్షలలోపు రూ.6, రూ.2 లక్షల-రూ.5 లక్షలలోపు రూ.10 ఛార్జీలు+GST చెల్లించాలి. శాలరీ అకౌంట్స్‌ను మినహాయించారు. కార్పొరేట్ కస్టమర్లకు ఇవి SEP 8 నుంచి అమలులోకి రానున్నాయి.
News August 14, 2025
పుతిన్‌కు ట్రంప్ హెచ్చరికలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 15న అలస్కా వేదికగా జరగనున్న సమావేశం తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా రాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ భేటీ ఊహించిన విధంగా కొనసాగితే.. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో కలిసి మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
News August 14, 2025
థియేటర్లలో మారణహోమం జరుగుతుంది: NTR

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ మూవీపై అంచనాలు పెంచేశారు. ‘ఇది యుద్ధం. ఇవాళ థియేటర్లలో మారణహోమం జరుగుతుంది. వార్2 మూవీపై గర్వంగా ఉన్నాను. దీనిపై మీ రియాక్షన్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అంతా ‘కొడుతున్నాం అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.