News August 6, 2024
ఆగస్టు 6: చరిత్రలో ఈ రోజు
1881: శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం
1934: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జననం
1943: అభ్యుదయ కవి కె.శివారెడ్డి జననం
1925: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ మరణం
2019: మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణం
2023: ప్రజా గాయకుడు గద్దర్ మరణం
Similar News
News September 14, 2024
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ?
AP: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిన్న ఈ నాలుగు జిల్లాల నేతలతో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. పోటీ చేసేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
News September 14, 2024
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది.
News September 14, 2024
మగ పిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి?
డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) వ్యాధి ఎక్కువగా మగపిల్లలకే సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా కండరాల క్షీణత, శ్వాసకోస సమస్యలు, నడవలేకపోవడం వంటివి ఎదుర్కొంటారు. దీనికి చికిత్స అందుబాటులో లేదు. కొంతకాలం జీవించి చనిపోతారు. ఈ వ్యాధి సోకిన వారు యుక్త వయసుదాటి బతకడం కష్టమే. ఇటీవల తెలంగాణకు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు ఈ వ్యాధి సోకింది. ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులకు 99% ఇది సోకుతుంది.