News February 8, 2025
శుభ ముహూర్తం(08-02-2025)

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.9.30 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.11.35 నుంచి మ.12.11 వరకు, సా.4.35 నుంచి 5.23 వరకు
✒ రాహుకాలం: ఉ.9.30 నుంచి మ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: తె.జా.3.42 నుంచి 5.15 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.07 నుంచి 2.38 వరకు
Similar News
News November 20, 2025
మొన్న కవిత కామెంట్.. నిన్న తుమ్మల రియాక్షన్

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కవిత పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ లీడర్‌ను వదులుకొని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారని, బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. కవిత కామెంట్స్ చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు BRS సమాధానాలు చెప్పాలని తుమ్మల అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
News November 20, 2025
ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.


