News March 9, 2025

శుభ ముహూర్తం (09-03-2025)

image

☛ తిథి: శుక్ల దశమి, ఉ.10.44 వరకు
☛ నక్షత్రం: పునర్వసు తె.2.05 వరకు
☛ శుభ సమయం: ఉ.8.03-8.39 వరకు
☛ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
☛ యమగండం: మ.12.00-1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
☛ వర్జ్యం: మ.2.25-3.59 వరకు
☛ అమృత ఘడియలు: రా.12.17-1.55 వరకు

Similar News

News January 6, 2026

డాక్టర్‌కూ తప్పని కుల వివక్ష!

image

TG: కులం రక్కసికి ఓ జూనియర్ డాక్టర్ బలైపోయింది. గద్వాల జిల్లాకు చెందిన లావణ్య చిన్నప్పటి నుంచి టాపర్. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్ తేజ్ అనే యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల కులాలు వేరని పెళ్లికి నో చెప్పడంతో ఆమె పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌ను పోలీసులు అరెస్టు చేసి అట్రాసిటీ కేసు పెట్టారు.

News January 6, 2026

SIR, ECపై మరోసారి మమత ఫైర్

image

SIR, ECపై ప.బెంగాల్ CM మమత మరోసారి సంచలన కామెంట్లు చేశారు. BJP ఐటీ సెల్ డెవలప్ చేసిన మొబైల్ అప్లికేషన్లను WBలో ఎలక్టోరల్ రోల్‌ సవరణకు ఎన్నికల సంఘం చట్టవిరుద్ధంగా వినియోగిస్తోందని ఆరోపించారు. ‘SIR నిర్వహణలో అన్ని తప్పుడు చర్యలను EC అవలంబిస్తోంది. అర్హులైన ఓటర్లను చనిపోయినట్టు చూపుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విచారణకు పిలుస్తోంది. ఇది అన్యాయం, అప్రజాస్వామికం’ అని మమత ఫైరయ్యారు.

News January 6, 2026

రేపు పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: పోలవరం ప్రాజెక్టును CM చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 10AMకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌, డయాఫ్రమ్ వాల్‌, కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పర్యవేక్షిస్తారు. తర్వాత అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. కాగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగింది.