News March 9, 2025

శుభ ముహూర్తం (09-03-2025)

image

☛ తిథి: శుక్ల దశమి, ఉ.10.44 వరకు
☛ నక్షత్రం: పునర్వసు తె.2.05 వరకు
☛ శుభ సమయం: ఉ.8.03-8.39 వరకు
☛ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
☛ యమగండం: మ.12.00-1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
☛ వర్జ్యం: మ.2.25-3.59 వరకు
☛ అమృత ఘడియలు: రా.12.17-1.55 వరకు

Similar News

News March 27, 2025

పుతిన్‌కి టైమ్ దగ్గర పడింది: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి టైమ్ దగ్గరపడిందని, త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిజమని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని జెలెన్‌స్కీ USను కోరుతున్నారు.

News March 27, 2025

ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

News March 27, 2025

హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

error: Content is protected !!